* ఆర్డీవో ఎస్. మల్లిబాబు
UPDATED 2nd JANUARY 2020 THURSDAY 6:00 PM
పెద్దాపురం(రెడ్ బీ న్యూస్): అర్హులైన పేద ప్రజలకు గృహ నిర్మాణాల కోసం అవసరమైన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని పెద్దాపురం ఆర్డీవో ఎస్. మల్లిబాబు తహసీల్దార్లను ఆదేశించారు. పెద్దాపురం డివిజన్ పరిధిలో గల తహసీల్దార్లతో భూసేకరణ ప్రక్రియపై ఆయన తన ఛాంబర్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉగాది నాటికి ఇళ్ళు లేని నిరుపేదలకు పంపిణీ చేయనున్న భూసేకరణ ప్రక్రియపై ఇంతవరకు ఇచ్చిన నివేదికను సమీక్షించారు. ఈ సమీక్షలో లబ్ధిదారుల సంఖ్య, నిర్మాణ పద్ధతి, కావలసిన భూమి విస్తరణ, గ్రామంలో భూమి లేనిచో లబ్ధిదారులకు గ్రామం, గుర్తించిన భూమి వివరాలు, ఉచిత భూమి, రెవెన్యూ ప్రభుత్వ భూమి, ఇతర శాఖల భూములు, బదలాయింపు ప్రతిపాదనలు పట్టాల రద్దు ,చెల్లించవలసిన భూమి విలువ, భూమి అభివృద్ధి, లేఅవుట్, ఉపాధి హామీ పథకం కింద అప్పగించిన పనులు, ఆన్ లైన్ తదితర అంశాలకు సంబంధించిన వివరాలతో కూడిన నివేదికను, మండలాల వారీగా తహశీల్దార్లతో సమీక్షించి తగు సూచనలు ఇచ్చారు. అలాగే ఇప్పటివరకు తయారుచేసిన భూమి వివరాలను పంచాయతీ కార్యాలయాలు, వాలంటరీల వద్ద వివరాలు నివేదిక ఉన్నది లేనిది తహసీల్దార్లు తనిఖీ చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం తహసీల్దార్ కె. పద్మావతి, డివిజన్ పరిధిలో గల తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, ఆర్డీవో కార్యాలయం ఏవో చిన్నారావు, కార్యాలయం డిప్యూటీ తహసీల్దార్ రామ్ కుమార్, సీనియర్ అసిస్టెంట్ నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.







