UPDATED 14th JULY 2018 SATURDAY 9:00 PM
సామర్లకోట: మొక్కలు పర్యావరణానికి, మనకు ఎంతో మేలు చేస్తాయని మున్సిపల్ కమీషనర్ సి.హెచ్. వెంకటేశ్వరావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వనం-మనం కార్యక్రమాన్ని స్థానిక బచ్చు ఫౌండేషన్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ కమీషనర్ వెంకటేశ్వరావు, ఆయన సతీమణి లక్ష్మీదేవి పాల్గొని విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమీషనర్ మాట్లాడుతూ ప్రతీ విద్యార్థి విధిగా మొక్కలు నాటడంతో పాటు వాటి పరిరక్షణకు బాధ్యత వహించాలని పేర్కొన్నారు. పాఠశాల హరిత క్లబ్ యన్.జి.సి.ఆధ్వర్యంలో వనం మనం కార్యక్రమంపై విద్యార్థులకు ఉపాధ్యాయులు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం తోటకూర సాయిరామకృష్ణ, ఉపాధ్యాయులు ఎ.ఎల్.వి. కుమారి, కె. శ్రీనివాస్, జి. గోవిందు, కె. అరుణ, కె.వి.వి. సత్యనారాయణ, ఎ.పి. రాజేంద్రకుమార్, పిఇటి వెంకటేశ్వర్లు, కోడూరి శివప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.







