* జాయింట్ కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ
UPDATED 30th JUNE 2020 TUESDAY 6:00 PM
పెద్దాపురం(రెడ్ బీ న్యూస్): జిల్లాలో నవరత్నాలు పథకంలో భాగంగా పేదలందరికీ ఇళ్ల స్థలాలకు సంబంధించి లేఅవుట్ల పనులు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ (ఆర్) డాక్టర్ జి. లక్ష్మీశ సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. పెద్దాపురం మండలం వడ్లమూరు గ్రామంలో ఇళ్ల స్థలాల కోసం సిద్ధం చేసిన లేఅవుట్లను మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవరత్నాల్లో భాగంగా పేదలందరికీ ఇళ్ళు కార్యక్రమానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు. అధికారులు లేఅవుట్ల
ప్రిపరేషన్ వెంటనే పూర్తి చేయాలన్నారు. అనంతరం స్థలాల కోసం లేఅవుట్లను ఏ విధంగా సిద్ధం చేశారు, లేఅవుట్లలో లబ్ధిదారుల స్థలాలకు నంబరింగ్ ఏ విధంగా కేటాయించారో రెవెన్యూ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే ఇళ్ల స్థలాల పొందనున్న లబ్ధిదారులతో జేసీ మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం రెవెన్యూ డివిజన్ అధికారి ఎస్. మల్లిబాబు, తహశీల్దార్ బూసి శ్రీదేవి, ఎంపీడీవో అబ్బిరెడ్డి రమణారెడ్డి, ఈవోపీఆర్డీ కరక హిమ మహేశ్వరి, ఆర్ఐ గౌషియా బేగం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కంటే వీర్రాఘవరావు, రెవెన్యూ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.







