UPDATED 9th NOVEMBER 2022 WEDNESDAY 06:30 PM
PM Modi South India Tour : ప్రధాని మోదీ దక్షిణాది రాష్ట్రాల పర్యటనకు రానున్నారు. రెండు రోజులు నవంబర్ 11, 12 తేదీల్లో కర్ణాటక, తమిళనాడు, ఏపీ, తెలంగాణలో పర్యటించనున్నారు. రూ.25వేల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టుల శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. బెంగుళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ 2ను ప్రధాని ప్రారంభించనున్నారు.
చెన్నై-మైసూరు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించనున్నారు. బెంగుళూరులో నాడప్రభు కెంపేగౌడ 108 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. విశాఖపట్నంలో ONGC U ఫీల్డ్ ఆన్‌షోర్ డీప్ వాటర్ బ్లాక్ ప్రాజెక్ట్‌ను జాతికి అంకితం చేయనున్నారు ప్రధాని మోదీ. గెయిల్ శ్రీకాకుళం అంగుల్ నేచురల్ గ్యాస్ పైప్‌లైన్ ప్రాజెక్ట్‌కు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు.
విశాఖపట్నంలో 6-లేన్ గ్రీన్ ఫీల్డ్ రాయ్‌పూర్-విశాఖపట్నం ఎకనామిక్ కారిడార్ ఏపీ విభాగానికి, విశాఖపట్నం రైల్వే స్టేషన్ పునరాభివృద్ధికి శంకుస్థాపన చేయనున్నారు ప్రధాని మోదీ. రామగుండం ఎరువుల కర్మాగారాన్ని ప్రారంభించనున్నారు. తమిళనాడులో దిండిగల్‌లోని గాంధీగ్రామ్ రూరల్ ఇన్‌స్టిట్యూట్ 36వ కాన్వొకేషన్ వేడుకలో ప్రసంగించనున్నారు.







