మున్సిపల్‌ కార్మికుల సమర శంఖం

UPDATED 4th OCTOBER 2018 THURSDAY 9:00 PM

సామర్లకోట: జీవో నెంబర్‌ 279 ను వెంటనే రద్దు చేయాలని, జీవో నెంబర్‌ 151ను అమలు చేసి బకాయిలు సహా వేతనాలు చెల్లించాలని తదితర డిమాండ్లతో ఆంధ్రప్రదేశ్ మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ ఇచ్చిన పిలుపు మేరకు స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్‌ కార్మికులు విధులు బహిష్కరించి గురువారం సమ్మె బాట పట్టారు. సిపిఐ మాజీ కౌన్సిలర్ ఎలిశెట్టి రామదాసు సమ్మెను ప్రారంభించగా, యూనియన్‌ రాష్ట్ర కార్యదర్శి ఉప్పలపాటి చంద్రదాస్‌ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా చంద్రదాస్ మాట్లాడుతూ జీవో నెంబరు 279 వలన కార్మికులు పని భద్రత కోల్పోయే ప్రమాదముందన్నారు. కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ అమలు చేయడం లేదన్నారు. కాంట్రాక్ట్‌, అవుట్‌సోర్సింగ్‌ కార్మికులకు పనిభద్రత లేకుండా చేసిన 279 ప్రభుత్వ ఉత్తర్వులను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. సమాన పనికి సమాన వేతనం అమలు చేసి 151 ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం పెంచిన వేతనాలను ఏరియర్స్‌తో సహా చెల్లించాలని కోరారు. ప్రభుత్వ మొండి వైఖరి పట్ల మున్సిపల్‌ కార్మికులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, కార్మికులకు ఉరితాడుగా మారనున్న జివో 279 రద్దు, సమాన పనికి సమాన వేతనం తదితర డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించేవరకు సమ్మె తప్పదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పరిసరాల పరిశుభత్ర, క్లీన్‌, అండ్‌ గ్రీన్‌ అంటూ నిత్యం ప్రచారం చేస్తోందని, అయితే కార్పోరేషన్లు, మున్సిపాల్టీలు, నగర పంచాయతీల్లో పారిశుధ్య విభాగంలో రోడ్లు ఊడ్చి, చెత్త ఎత్తుతూ తమ ఆరోగ్యాన్ని పణంగా పెట్టి ప్రజారోగ్య రక్షణకు నిరంతరం పాటుపడుతున్న కార్మికుల సమస్యలు మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికే కాంట్రాక్టు ఔట్‌ సోర్సింగ్‌ పేరుతో తీసుకున్న కార్మికులకు కనీస వేతనాలు లేకుండా చేసిందని, 279 జివోను తీసుకువచ్చి కార్మికులు కాంట్రాక్టర్‌ల దయాదాక్షిణ్యాల మీద ఆదారపడేలా చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి పట్టణ కార్యదర్శి కామిరెడ్డి బోడకొండ, సింగంపల్లి శ్రీనివాస్, గడుపు అనిత, బంగారు తులసి, అల్లం రత్నం, మల్లవరపు శకుంతల, సింగంపల్లి భవాని, తదితరులు పాల్గొన్నారు..

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us