గైట్ లో అడ్వాన్స్ ఫైనేట్ ఎలిమెంట్ అనాలసిస్ పై సదస్సు

UPDATED 7th DECEMBER 2018 FRIDAY 8:00 PM

రాజానగరం: గోదావరి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (గైట్) అటానమస్ కళాశాల మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో అడ్వాన్స్ ఫైనేట్ ఎలిమెంట్ అనాలసిస్ అనే అంశంపై శుక్రవారం సదస్సు నిర్వహించారు. మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి కె. సుబ్బారావు అధ్యక్షతన జరిగిన ఈ సదస్సుకు యూకాన్ టెక్నాలజీస్ (బెంగుళూరు) సీనియర్ సిమ్యులేషన్ ఇంజనీర్ జి.ఎం. రాజా మహేంద్ర ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని ఆ లక్ష్య సాధన కోసం ప్రణాళికాబద్ధంగా పట్టుదలతో కృషి చేయాలని, అత్యాధునిక సాంకేతిక అంశాలపై పరిజ్ఞానాన్ని  పెంపొందించుకోవాలని కోరారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టివి ప్రసాద్ మాట్లాడుతూ విజ్ఞానాన్ని మరింత పెంపొందించుకునేందుకు ఇటువంటి సదస్సులు ఎంతగానో దోహదపడతాయని, విద్యార్థులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా కళాశాల తరఫున రాజా మహేంద్రను దుశ్శశాలువాతో ఘనంగా సన్మానించి జ్ఞాపిక అందచేశారు. ఈ కార్యక్రమంలో మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి కె. సుబ్బారావు, సదస్సు కన్వీనర్ డి. సుమన్, తదితరులు పాల్గొన్నారు.           

 

 

 

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us