UPDATED 3rd JULY 2019 WEDNESDAY 8:00 PM
అనపర్తి: మండల పరిధిలోని కుతుకులూరు గ్రామంలో బుధవారం నిర్వహించిన ఉచిత దంత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. రాజానగరంలోని కెఎల్ఆర్ లెనోరా దంత వైద్య కళాశాల, ఆసుపత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరంలో వైద్యుల బృందం సుమారు 65 మందికి దంత పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అనంతరం దంతాల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ యశోధర, డాక్టర్ శ్రీరామ్, డాక్టర్ ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.







