అత్యాచారం చేసిన వ్యక్తిని శిక్షించాలంటూ ధర్నా

UPDATED 16th MARCH 2018 FRIDAY 10:00 PM

సామర్లకోట: మానసిక స్థితి సరిగా లేని దివ్యాంగురాలిపై అత్యాచారం చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఐద్వా సంఘ నాయకులు శుక్రవారం స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద ధర్నా నిర్వహించారు. శీలం వీరబాబు (కాష్మోరా) అనే వ్యక్తి ఆమెను క్వారీ గోతుల వద్దకు తీసుకుని వెళ్లి అత్యాచారం చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీ కార్యకర్తలు, మానవ హక్కుల సంఘ నాయకులు ధర్నా నిర్వహించి ఎస్సై ఎల్.  శ్రీనివాస్ నాయక్ కు వినతిపత్రం అందజేశారు. పెద్దాపురం డి.ఎస్.పి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ ఆందోళనలో ఐద్వా సంఘం నాయకులు కె. వరలక్ష్మి, ఎం.వి. శ్రీలక్ష్మి, బాలం లక్ష్మి, ఎస్.కె. ఫాతిమా, మానవ హక్కుల సంఘం జిల్లా అధ్యక్షుడు నూతలపాటి అప్పలకొండ, తదితరులు పాల్గొన్నారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us