గైట్ లో ఘనంగా రాష్ట్రీయ ఏక్తా దివస్

UPDATED 31st OCTOBER 2018 WEDNESDAY 6:00 PM

రాజానగరం: గోదావరి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (గైట్) అటానమస్ కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో సర్ధార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని రాష్ట్రీయ ఏక్తా దివస్ కార్యక్రమం బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టి.వి. ప్రసాద్, తదితరులు ముందుగా పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రసాద్ మాట్లాడుతూ పటేల్ దేశభక్తిని, కార్యశూరతను వివరించారు. అనువంశిక పాలనలో ఉన్న సంస్థానాలను భారతదేశంలో విలీనం అయ్యేందుకు పటేల్ చేసిన కృషిని వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో గైట్ అటానమస్ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ డి.వి. రామ్మూర్తి, హెచ్.బి.ఎస్ విభాగాధిపతి డాక్టర్ వి. కుసుమకుమారి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ వై.డి. శివ ప్రసాద్, అధ్యాపకులు, విద్యార్థినీ, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.      

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us