* జిల్లా జాయింట్ కలెక్టర్ (డబ్ల్యూ) రాజకుమారి
UPDATED 19th AUGUST 2020 WEDNESDAY 6:30 PM
కాకినాడ (రెడ్ బీ న్యూస్): ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు ఆక్సిజన్ కొరత లేకుండా సక్రమంగా అందించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ (డబ్ల్యూ) జి. రాజ కుమారి అధికారులను ఆదేశించారు. స్థానిక ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో గల ఆక్సిజన్ ప్లాంట్, వార్డులను ఆమె వైద్యాధికారులతో కలిసి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా జెసీ మాట్లాడుతూ ఆసుపత్రిలో ఆక్సిజన్ సరఫరా సక్రమంగా నిర్వహించాలని, ఆక్సిజన్ నిల్వలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. తొలుత జెఎన్టీయులో గల కోవిడ్ కేర్ సెంటర్ ను పరిశీలించి భోజన వసతి, పారిశుద్ధ్య పనులు సక్రమంగా నిర్వహించాలని సిబ్బందిని ఆదేశించారు. అలాగే అక్కడ ఉన్న లేబరేటరీని పరిశీలించి డేటా ఎంట్రీ ఏ విధంగా చేస్తున్నారో సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు 600 మంది కోవిడ్ కేర్ సెంటర్ లో చికిత్స పొందుతున్నారని ఆమె తెలిపారు. జేసి వెంట జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం. రాఘవేంద్రరావు, ఆర్ఎంవో డాక్టర్ గిరిధర్, సిఎస్ఆర్ఎంవో డాక్టర్ పద్మ శశిధర్, డాక్టర్ జిలాని, ఇతర సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.







