UPDATED 16th FEBRUARY 2018 FRIDAY 10:00 PM
సామర్లకోట: పశువుల్లో వచ్చే గాలికుంటు వ్యాధి పట్ల పశుపోషకులు అప్రమత్తంగా ఉండాలని సామర్లకోట పశు వైద్యశాల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ వై. శ్రీనివాసరావు అన్నారు. స్థానిక పశు వైద్యశాలలో పశువులకు గాలికుంటువ్యాధి నివారణా టీకాల కార్యక్రమాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ టీకాలు వేయడం ద్వారా పశువుల్లో అధిక పాల దిగుబడులు వస్తాయని పేర్కొన్నారు. అలాగే సకాలంలో టీకాలు వేయడం వల్ల వ్యాధులు రాకుండా అరికట్టవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల పరిధిలోని పశు వైద్యులు, రైతులు పాల్గొన్నారు.







