UPDATED 24th JANUARY 2020 FRIDAY 9:00 PM
సామర్లకోట(రెడ్ బీ న్యూస్): మూడు రాజధానుల బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపి శాసన మండలి చైర్మన్ ఎం.ఎ. షరీఫ్ ఎంతో నిజయితీగా వ్యవహరించారని తెలుగుదేశం పార్టీ నాయకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సామర్లకోట పట్టణంలో పార్టీ శ్రేణులు శుక్రవారం షరీఫ్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. షరీఫ్ నీతి, నిజాయితీతో, నియమ నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించారని ఆయనను కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు యార్లగడ్డ రవిచంద్ర ప్రసాద్ (చిన్ని), అడబాల కుమారస్వామి, బడుగు శ్రీకాంత్, కంటే జగదీష్ మెహన్(బాబు), అందుగుల జార్జి చక్రవర్తి, మొండెం సారయ్య, కృష్ణబాబు, వంశీ, గొల్తి సత్యనారాయణ, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు, ముస్లిం మత పెద్దలు, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.







