కాండ్రకోట నూకాలమ్మ జాతర మహోత్సవాలు ప్రారంభం

UPDATED 4th APRIL 2019 THURSDAY 10:00 PM

పెద్దాపురం: తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం కాండ్రకోట గ్రామంలో వేంచేసి ఉన్న నూకాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు గురువారం రాత్రి అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. అమ్మ వారిని దర్శించుకునేందుకు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాలతో పాటు రాష్ట్రం నలుమూలల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. తొలుత అమ్మవారిని వివిధ రకాల పుష్పమాలలతో విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయాన్ని విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. వందల సంవత్సరాలుగా తూర్పు ప్రాంత జిల్లాల నుంచి  భక్తులు ఎడ్ల బండ్లుపై ఆలయానికి తరలివచ్చి అక్కడే వంటలు తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి మొక్కులుగా అరటి పండ్లు గెలలు, కోళ్లు, మేకలు, ఎనుబోతులను అమ్మవారికి సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. నేటికీ ఈ సంప్రదాయాలను భక్తులు పాటించడం విశేషం. జాతర మహోత్సవాలు సందర్భంగా గరగ నృత్యాలు, బాణసంచా కాల్పులు, సన్నాయి, బ్యాండు మేళాలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. పెద్దాపురం నుంచి కాండ్రకోట వెళ్లే ప్రధాన రహదారితో పాటు దివిలి-కాండ్రకోట రహదారులు వాహనాల రద్దీతో కిక్కిరిసిపోయాయి. పెద్దాపురం డిఎస్పీ చిలకా వెంకట రామారావు ఆధ్వర్యంలో జాతర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రత్యేక పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈనెల 4 నుంచి మే నెల 19వ తేదీ వరకు సుమారు 45 రోజులపాటు ఈ జాతర మహోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి పులి నారాయణమూర్తి తెలిపారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.           

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us