చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు పలకరింపు దోహదం

UPDATED 6th MARCH 2018 TUESDAY 10:00 PM

సామర్లకోట: చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు పలకరింపు దోహదపడుతుందని ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ అడబాల కుమారస్వామి పేర్కొన్నారు. స్థానిక మునిసిపల్ కార్యాలయంలో అయిదు సంవత్సరాల లోపు వయసు ఉన్న పిల్లల ఆరోగ్యం పోషణ స్థితిగతులను తెలుసుకొనేందుకు నిర్వహించిన పలకరింపు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అలాగే ఈ కార్యక్రమాన్ని  విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. మున్సిపాలిటీ పరిధిలోని అంగన్వాడీ కార్యకర్తలకు మున్సిపల్, మెప్మా సహకారంతో నిర్వహించిన ఈ పలకరింపు కార్యక్రమంపై అవగాహన కల్పించారు. ప్రతి అంగన్వాడీ కార్యకర్త ఆయా కేంద్రాల పరిధిలోని అన్ని కుటుంబాల్లో ఉన్న చిన్నారులను యోగక్షేమాలను అడిగి తెలుసుకోవాలన్నారు. అలాగే పట్టణ పరిధిలోని అంగన్వాడీ కార్యకర్తలతో పాటు ఇద్దరు ఎ ఎన్ ఎం ఉంటారని చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుడు డాక్టర్ పి. చందర్రావు మాట్లాడుతూ ఈ పలకరింపు కార్యక్రమంలో భాగంగా పిల్లలకు వ్యాధులకు సంబంధించి ముందుగా వేయించాల్సిన వ్యాక్సినేషన్ పై అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ వెంకటేశ్వరరావు, పట్టణ మెప్మా అధికారి ఎం సుజాత ఐసిడిఎస్ సూపర్ వైజర్లు నళిని, బాలత్రిపుర సుందరి, మణి ,మంగ, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us