UPDATED 12th SEPTEMBER 2018 WEDNESDAY 9:00 PM
గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య గ్లోబల్ బిజినెస్ స్కూల్ బిబిఎ మొదటి సంవత్సరం విద్యార్థులు ఇండస్ట్రియల్ టూరులో భాగంగా కడియం మండలం జేగురుపాడులో గల రామదాస్ పేపర్ మిల్లును సందర్శించినట్లు కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎన్. సుగుణారెడ్డి తెలిపారు. ఈ సందర్శనలో భాగంగా విద్యార్థులు పేపర్ ఉత్పత్తి, తదితర పద్దతులను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ సుగుణారెడ్డి మాట్లాడుతూ తమ సంస్థ విద్యార్థులు భవిష్యత్తులో గొప్ప వ్యాపారవేత్తలుగా ఎదగడానికి ఇటువంటి పారిశ్రామిక సందర్శనలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. విద్యార్థులు నేటి పోటీ ప్రపంచంలో విజేతలుగా నిలవడానికి కేవలం పుస్తక పరిజ్ఞానం ఒక్కటే సరిపోదని, వారు ఎంచుకున్న రంగాల్లో విశ్లేషాత్మకంగా, ప్రయోగాత్మకంగా జ్ఞానాన్ని సులభంగా పొందడానికి ఈ సందర్శనలు ఉపయోగపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి. ఆస్థాశర్మ, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.







