UPDATED 27th FEBRUARY 2018 TUESDAY 7:00 PM
సామర్లకోట: స్త్రీనిధి, డి.ఆర్.డి.ఎ. పథకాలు, తదితర ఋణాలు పొందినవారు నుంచి రికవరీలు సకాలంలో చేపట్టాలని డి.ఆర్.డి.ఎ పిడి ఎస్.మల్లిబాబు అన్నారు. స్థానిక టిటిడిసి ఆవరణలో ఏరియా కో-ఆర్డినేటర్లతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మంగళవారం మాట్లాడుతూ అందరికీ రుణాలు అందే విధంగా చూడవలసిన బాధ్యత డిపిఎం, ఏపీఎం, ఏసీలు, సిసిలపై ఉందని అన్నారు. మహిళా సంఘాల అభివృద్ధికి వారికి కావలసిన సలహాలు సూచనలు ఇవ్వాలన్నారు. అలాగే మహిళా సంఘాలు చేసే వ్యాపారులకు అవసరమైన శిక్షణ ఇవ్వాలన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా బహుమతులు అందించే వివిధ రకాల ఆటల పోటీలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎపిడి శ్రీనివాస్ కుమార్, స్త్రీ నిధి ఎజిఎం ధర్మేంద్ర, ఏరియా కో-ఆర్డినేటర్లు,ఎపిఎం లు తదితరులు పాల్గొన్నారు.







