UPDATED 7th JUNE 2017 WEDNESDAY 6:30 PM
పెద్దాపురం: ఢిల్లీ లోని సిపిఎం కేంద్ర కార్యాలయం పై ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తలు దాడి చేయడాన్ని సిపిఎం పట్టణ కమిటీ తీవ్రంగా ఖండించింది. స్థానిక యాసలపు సూర్యారావు భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సిపిఎం నాయకులు మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా దేశంలో మతోన్మాదం పెరిగి మైనారిటీలు, దళితులపై దాడి చేయడం జరుగుతోందన్నారు. ఓ వర్గాన్ని చంపితే నగదు బహుమతి ఇస్తామని అనాగరిక చర్యలకు పాల్పడడం పెరిగిపోతున్నాయన్నారు. వీటిని వ్యతిరేకించే పార్టీల కార్యాలయాలపై దాడులు జరగడం పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో సిపిఎం పట్టణ కార్యదర్శి నీలపాల సూరిబాబు, సిరిపురపు శ్రీనివాస్, గడిగట్ల సత్తిబాబు, దారపురెడ్డి కృష్ణ, కె. నాగు తదితరులు పాల్గొన్నారు.







