AP News: తల్లితో గొడవపడి యువకుడు ఆత్మహత్యాయత్నం.. కాపాడిన పోలీసులు

ప్రొద్దుటూరు (రెడ్ బీ న్యూస్) 13 డిసెంబర్ 2021: కడప జిల్లా ప్రొద్దుటూరులో యువకుడి ప్రాణాలను పోలీసులు కాపాడారు. చౌటపల్లి గ్రామానికి చెందిన సుబ్బరాయుడు తల్లి చెన్నమ్మతో గొడవపడ్డాడు. క్షణికావేశంతో ఆత్మహత్య చేసుకుంటానని ఇంట్లోకి వెళ్లి తలుపు వేసుకున్నాడు. ఆందోళన చెందిన తల్లి వెంటనే ఆ ప్రాంతంలో గస్తీ నిర్వహించే బ్లూకోల్ట్స్ సిబ్బందికి చరవాణి ద్వారా సమాచారం అందించారు. నిమిషాల వ్యవధిలో బ్లూకోల్ట్స్ సిబ్బంది రామాంజనేయులు, నరసింహనాయుడు ఘటనాస్థలికి చేరుకున్నారు. స్థానికుల సాయంతో తలుపును పగులగొట్టి ఫ్యాన్‌కు వేలాడుతున్న యువకుడిని కిందికి దించి ఆసుపత్రికి తరలించారు. వేగంగా స్పందించి యువకుడిని సమయ స్ఫూర్తితో కాపాడిన పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ అన్బురాజన్, ప్రొద్దుటూరు బాధ్య డీఎస్పీ చెంచు బాబు, స్థానికులు అభినందించారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us