మార్చి 18 నుంచి నామినేషన్లు స్వీకరణ

UPDATED 17th MARCH 2019 SUNDAY 8:00 PM

పెద్దాపురం: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా పెద్దాపురం నియోజకవర్గానికి సంబంధించి ఈ నెల 18 నుంచి  నామినేషన్లు స్వీకరించడం జరుగుతుందని రిటర్నింగ్ అధికారి, ఆర్డీవో ఎన్.ఎస్.వి.బి. వసంతరాయుడు తెలిపారు. ఈ సందర్భంగా ఆర్డీవో వసంతరాయుడు మాట్లాడుతూ మార్చి నెల 18వ తేదీ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటలు వరకు నామినేషన్లు స్వీకరిస్తామని, అభ్యర్థితో పాటు నలుగురిని  మాత్రమే అనుమతించాలని ఎన్నికల కమీషన్ సూచించడం జరిగిందని తెలిపారు. నామినేషన్లు ఈ నెల 25వ తేదీ వరకు సెలవు రోజులు మినహా మిగతా రోజుల్లో స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. నామినేషన్లు సమయంలో స్వీకరించే ప్రదేశము నుంచి 100 మీటర్లు లోపు అభ్యర్థులను అనుమతిస్తామని తెలిపారు. నామినేషన్లు చివరిరోజు 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటలు లోపు వచ్చిన నామినేషన్లు అన్నింటిని అంగీకరిస్తామని తెలిపారు. నామినేషన్ సమయంలో క్రిమినల్ కేసులు ఉన్న అభ్యర్థులు ఫారం- 26లో వివరాలు తెలియచేయాలని, పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల కమీషన్ సూచించిన నియమాలను తూచా తప్పకుండా పాటించాలని ఆర్డీవో కోరారు.

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us