పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత

UPDATED 14th JULY 2018 SATURDAY 9:00 PM

పెద్దాపురం: పర్యావరణ పరిరక్షణకు, వాతావరణ సమతౌల్యానికి మొక్కల పెంపకమే ఏకైక మార్గమని, ప్రతీ ఒక్కరూ మొక్కల పెంపకాన్ని బాధ్యతగా తీసుకోవాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. స్థానిక ఇరిగేషన్ కార్యాలయంలో నిర్వహించిన వనం-మనం కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, కాకినాడ ఎంపి తోట నరసింహం, జిల్లా కలెక్టరు కార్తికేయమిశ్రా పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు అధ్యక్షతన జరిగిన సభలో ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప మాట్లాడుతూ ఈ వనం-మనం కార్యక్రమం ద్వారా జిల్లా వ్యాప్తంగా 80 వేల మొక్కలు, పెద్దాపురం పట్టణంలో 1000 మొక్కలు నాటుతున్నామని తెలిపారు. ప్రతీ ఒక్కరూ తమ తమ పుట్టినరోజు, పెండ్లిరోజులలో తప్పనిసరిగా మొక్కలు నాటే సాంప్రదాయాన్ని అలవర్చుకోవాలన్నారు. సామర్లకోట, పెద్దాపురం పట్టణాల్లో గల చెఱువులను పార్కులుగా మార్చి మొక్కలతో ఆహ్లాదకరంగా, సుందరంగా చేస్తున్నట్లు పేర్కొన్నారు. పాండవులమెట్టపై రూ. రెండు కోట్లతో నిర్మించిన శతాబ్ది పార్క్ రాష్ట్రవ్యాప్తంగా పేరు పొందిందని, అలాగే రహదారి విస్తరణ పనులు పూర్తి చేస్తున్నామని, రూ. మూడు కోట్లుతో సెంట్రల్ లైటింగ్ కూడ అమర్చడం జరుగుతుందని చెప్పారు. ఎంపి తోట నరసింహం మాట్లాడుతూ మానవుని ప్రాణాలను నిలబెట్టడానికి మొక్కలే కారణమని, మొక్కలు పెంచడం వల్ల కాలుష్యం నివారణ అవుతుందని తెలిపారు. మొక్కలను ప్రభుత్వం ఉచితంగా అందచేస్తుందని ప్రజలు వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లా కలెక్టరు కార్తికేయమిశ్రా మాట్లాడుతూ వనం మనం కార్యక్రమాన్ని పెద్దాపురం పట్టణంలో అత్యంత ఉత్సాహంగా, ప్రణాళికాబద్దంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాండవులమెట్ట, ఎడిబి రోడ్, కొత్తపేట పెట్రోల్ బంక్ వరకు కాలినడకన ర్యాలీ నిర్వహించిన అనంతరం స్వచ్ఛ ఆంధ్రమిషన్ ద్వారా పెద్దాపురం మున్సిపాల్టీకి 10 టన్నుల సామర్ధ్యం గల చెత్తను తరలించే వాహనాన్ని ఎంపి, రహదార్లు శుభ్రపరిచే వాహనాన్ని జిల్లా కలెక్టరు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో వసంతరాయుడు, డి.ఎఫ్.వో శ్రీనివాసరావు, మున్సిపల్ కమీషనర్ బి.ఆర్. శేషాద్రి, ఎఎంసి చైర్మన్ ముత్యాల రాజబ్బాయి, ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ బొడ్డు బంగారుబాబు, ఆత్మా చైర్మన్ కలకపల్లి రాంబాబు, తహసీల్దార్ గంగుమళ్ళ బాలసుబ్రహ్మణ్యం, వైస్ చైర్మన్ కొరుపూరి రాజు, కౌన్సిలర్లు, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us