UPDATED 1st NOVEMBER 2018 THURSDAY 10:00 PM
రాజానగరం: స్థానిక కెఎల్ఆర్ లెనోరా దంతవైద్య కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ప్రముఖ సినీ నేపధ్య గాయకుడు, రచయిత పెంచలయ్య ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశలో యువత మంచి నడవడిక కలిగి మంచి మార్గాలను నిర్దేశించుకుని జీవిత గమ్యాలను చేరుకోవాలని, అలాగే జీవితంలో ఎంచుకున్న మార్గాలను లక్ష్యసాధన దిశగా కృషి చేయాలని అన్నారు. విద్యార్థి దశలో తన జీవితంలో ఎదురైనా ముఖ్య సంఘటనలు, అనుభవాలను విద్యార్థులతో పంచుకున్నారు. లేనిపోని ఆకర్షణలకు లోనై జీవితాన్ని పాడుచేసుకోవద్దని విద్యార్థులకు సూచించారు. ఇటీవల విడుదలైన అరవింద సమేత వీరఘవలోని పాటలతో పాటు ఆయన రచించిన పలు పాటలను ఆలపించి విద్యార్థులు ఉర్రూతలూగించారు. అనంతరం పెంచలయ్యను కళాశాల చైర్ పర్సన్ కె. నాగమణి ఘనంగా సన్మానించి జ్ఞాపిక అందచేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ జి. నాగేశ్వరరెడ్డి, ప్రిన్సిపాల్ విశ్వప్రకాష్ శెట్టి, డైరెక్టర్ ఆఫ్ పిజి స్టడీస్ డాక్టర్ బి. లక్ష్మణరావు, అధ్యాపకులు, అధిక సంఖ్యలో విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.







