ఇంటర్ యూనివర్సిటీ కబడ్డీ పోటీలకు గైట్ విద్యార్థులు

UPDATED 16th NOVEMBER 2018 FRIDAY 6:00 PM

రాజానగరం: గోదావరి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (గైట్) కళాశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు ఇంటర్ యూనివర్సిటీ కబడ్డీ పోటీల్లో పాల్గొంటున్నట్లు కళాశాల ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ సి. మంజ్రేకర్ హెన్రీ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన శుక్రవారం మాట్లాడుతూ గైట్ కళాశాల ఎంటెక్ విద్యార్థి దాడి రమాప్రసాద్, బిటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థి చందనాడ నాగేశ్వరరావు జెఎన్టీయుకె కబడ్డీ టీముకు ఎంపికయ్యారని అన్నారు. చెన్నైలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఈ నెల 19 నుంచి 23వ తేదీ వరకు జరిగే ఈ పోటీల్లో వీరు పాల్గొంటారన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను చైతన్య విద్యా సంస్థల చైర్మన్ కెవివి సత్యనారాయణరాజు (చైతన్యరాజు), గైట్ మేనేజింగ్ డైరెక్టర్ కె. శశికిరణ్ వర్మ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె. లక్ష్మీశశివర్మ అభినందిస్తూ ఇంటర్ యూనివర్సిటీ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ ప్రదర్శించాలన్నారు. ఈ కార్యక్రమంలో గైట్ అటానమస్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టి.వి. ప్రసాద్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.ఎస్.ఎన్. మూర్తి, జనరల్ మేనేజర్ డాక్టర్ పి. సుబ్బరాజు, వ్యాయమ విద్యా విభాగం కోచ్ ఆర్. అప్పారావు, తదితరులు పాల్గొన్నారు.               

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us