ఆదిత్యలో ముగిసిన ఐఇఇఇ సెమినార్

UPDATED 6th OCTOBER 2018 SATURDAY 8:00 PM

గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ క్యాంపస్ లో గల ఆదిత్య కాలేజ్ అఫ్ ఇంజనీరింగ్  అండ్ టెక్నాలజీ కళాశాలలో అక్టోబర్ 5,6 తేదీలలో రెండు రోజుల పాటు నిర్వహించిన  ఐఇఇఇ సెమినార్ విజయవంతంగా ముగిసినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టి.కె. రామకృష్ణారావు తెలిపారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ (ఐఇఇఇ) వైజాగ్ బి సబ్ సెక్షన్, ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ  సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సెమినార్ లో వక్తలు పలు అంశాలపై మాట్లాడి విద్యార్థులకు వివరించారు. స్టెమ్ ప్రాజెక్ట్ డి.ఎస్.పి ఆర్కిటెక్చర్స్, సిగ్నల్ ప్రాసెసింగ్,సాఫ్ట్ వేర్ డవలప్ మెంట్, రేడియేషన్ హజార్డ్స్ తదితర అంశాలపై విద్యార్థులకు వివరించారు. ఈ సెమినార్ లో వైజాగ్,  హైద్రాబాద్ కు చెందిన ప్రముఖ ప్రొఫెసర్స్ డాక్టర్  ఎస్. లక్ష్మీనారాయణ, ప్రొఫెసర్ ఎన్. శ్రీనివాసరావు, డాక్టర్ పి. సతీష్, ప్రొఫెసర్ ఎన్. దీపికారాణి, టి. సాయికుమార్,  కళాశాల విభాగాధిపతులు ప్రొఫెసర్ ఆర్.వి.వి. కృష్ణ, ప్రొఫెసర్ డి. కిషోర్, అధ్యాపక బృందం, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం సదస్సులో పాల్గొన్న వక్తలను ఆదిత్య యాజమాన్యం దుశ్శాలువా, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us