UPDATED 17th JUNE 2020 WEDNESDAY 6:30 PM
కాకినాడ(రెడ్ బీ న్యూస్): కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టి, ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించేందుకు చేపట్టిన అత్యవసరమైన చర్యలలో భాగంగా ఈనెల 11 నుంచి జిల్లాలో కరోనా వైరస్ ఉనికి గుర్తించిన మరో 22 ప్రాంతాలలో కంటైన్మెంట్ జోన్లను నోటిఫై చేస్తూ జిల్లా కలెక్టర్ డి. మురళీధర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.
సామర్లకోట మున్సిపాలిటీలో ఈనెల 11వ తేదీ నుంచి రెండు కంటైన్మెంట్ జోన్లను (1) చిన్న వీధి, కందదొడ్డి (2) గణపతినగరం, మెహర్ కాంప్లెక్స్ ప్రాంతాల్లో అమలుకు ఆదేశించారు. కాకినాడ రూరల్ మండలంలో రమణయ్య పేటలోని 4 ప్రాంతాల్లో (1) బాలాజీ నగర్ (2) అంజనేయనగర్ (3) రాయుడుపాలెం (రాయుడుపాలెం, వాటర్ టాంక్, రాజీవ్ నగర్, దుర్గమ్మ గుడి) (4) ఏపీఎస్పీ క్వార్టర్ ప్రాంతాల్లో ఈనెల 12వ తేదీ నుంచి కంటైన్మెంట్ జోన్లను ప్రకటించారు. ఈనెల 13వ తేదీ నుంచి (1) పి.గన్నవరం మండలం, ఏనుగుపల్లి-7, 8 వార్డులు (2) రాజవొమ్మంగి మండలం జడ్డంగి (రైస్ మిల్లు ఏరియా, ఇందిరానగర్) (3) రాజవొమ్మంగి మండలం, జడ్డంగి (రైస్ మిల్లు ఏరియా)(4) పెద్దాపురం మండలం కట్టమూరు (ఎస్సీ పేట) (5) కాకినాడ రూరల్ మండలం, రాయుడుపాలెం దుర్గగుడి (6) కొత్తపేట మండలం, మందపల్లి- బీసీ పేట (7) కొత్తపేట మండలం, వానపల్లి- ఇళ్లవారిపాలెం ప్రాంతాల్లో కంటైన్మెంట్ జోన్లు ప్రకటించారు. ఈనెల 14వ తేదీ నుంచి (1) తొండంగి మండలం, ఏ.వి.నగరం (గంగాలమ్మ వీధి, బ్యాంకు వీధి) (2) బిక్కవోలు మండలం, చెల్లూరు (3) కాకినాడ రూరల్ మండలం, సర్పవరం- మండపం కాలనీ (పూలమార్కెట్,
ఎస్సీ పేట , ఉషా సీఫుడ్స్, వినాయక టెంపుల్) (4) కాకినాడ రూరల్ మండలం, రమణ్యయ్యపేట రాయుడుపాలెం, సిటిసి చర్చి (5) కాకినాడ సిటీ, జయేంద్రనగర్, వార్డు-3ఏ ప్రాంతాలలో కంటైన్మెంట్ జోన్లు నోటిఫై చేశారు. ఈనెల 15వ తేదీ నుంచి (1) కాకినాడ రూరల్ మండలం, తిమ్మాపురం కొత్తపేట, హరిజనపేట (2) కాకినాడ సిటీ, కొండయ్యపాలెం-45ఏ (3) కడియం మండలం, మురముండ దాకలిపేట (4) రామచంద్రపురం పట్టణం, వార్డు-12( జండా పంజావీధి, శ్రీరామ్ పేట) ప్రాంతాలలో కంటైన్మెంట్ జోన్లు ప్రకటించారు.
జిల్లాలో ఇప్పటి వరకూ పట్టణ ప్రాంతాల్లో 35, గ్రామీణ ప్రాంతాలలో 61, గిరిజన ప్రాంతాలలో 7, మొత్తం 103 కంటైన్మెమెంట్ జోన్లను ప్రకటించారు. వీటిలో 35 వెరీయాక్టివ్, 25 యాక్టివ్, 24 డార్మెంట్ జోన్లు ఉండగా, వైరస్ ఉనికి కట్టడిలోకి వచ్చిన 19 ప్రాంతాలలో కంటైన్మెంట్ జోన్లను ఉపసంహరించారు.







