UPDATED 30th SEPTEMBER 2018 SUNDAY 9:00 PM
రాజానగరం: స్థానిక లెనోరా దంత వైద్య కళాశాలలో రెండురోజుల పాటు నిర్వహించిన జాతీయస్థాయి పెరియతరంగ్ కన్వెన్షన్-2018 ఆదివారం ఘనంగా ముగిసింది. ఈ సందర్భంగా కళాశాల చైర్ పర్సన్ కె. నాగమణి మాట్లాడుతూ వైద్యులకు రోగి ప్రత్యక్ష దేవుడని, వారి మన్ననలు పొందినప్పుడే రాణిస్తామన్న విషయాన్ని వైద్యులు గుర్తించుకోవాలని అన్నారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి ఈ సదస్సు ద్వారా నేర్చుకున్న అనేక నూతన విషయాలు తమ వృత్తిలో సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, బహుమతులు అందచేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రజనీష్ రెడ్డి, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెరియోడాంటాలజీ అధ్యక్షుడు డాక్టర్ నితిన్, సదస్సు చైర్మన్ డాక్టర్ రమేష్ అమిరిశెట్టి, కార్యదర్శి డాక్టర్ రూపశ్రీ గుండాల, కళాశాల డైరెక్టర్ డాక్టర్ జి. నాగార్జునరెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ విశ్వప్రకాష్ శెట్టి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ దాల్ సింగ్, డైరెక్టర్ ఆఫ్ పిజి స్టడీస్ డాక్టర్ బి. లక్ష్మణరావు, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.







