విద్యార్థులకు నైతిక విలువలతో కూడిన విద్య అందించాలి

UPDATED 1st AUGUST 2019 THURSDAY 9:00 PM

సామర్లకోట: విద్యార్థులకు నైతిక విలువలతో కూడిన విద్య అందించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దాపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ దవులూరి దొరబాబు అన్నారు. స్థానిక యార్లగడ్డ అక్కిరాజు మున్సిపల్ ఉన్నత పాఠశాలలో గురువారం జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు పంపిణీ చేశారు. అనంతరం మాజీ కౌన్సిలర్ కాళ్ళ లక్ష్మీనారాయణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో దొరబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన అమ్మఒడి పథకం విద్యార్థులపాలిట ఒక వరంలా మారనుందని అన్నారు. విద్యార్థులు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకుని ఉన్నతస్థాయికి ఎదగాలని తెలిపారు. వచ్చే జనవరి 26న ఆయా విద్యార్థుల తల్లుల బ్యాంకు ఎకౌంట్లలో ప్రభుత్వం అందించే అమ్మఒడి పథకానికి సంబంధించిన మొత్తం జమ అవుతుందని, అలాగే నవరత్నాల పధకాలను విజయవంతంగా అమలు చేయడానికి  ప్రజలంతా సహకారం అందించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమానికి ముందు వైయస్సార్ పింఛన్ల కార్యక్రమాన్ని ప్రారంభించి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు వారి సమస్యలపై ఆయనకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ ఎం. ఏసుబాబు, మండల విద్యాశాఖాధికారి వైవి శివరామ కృష్ణయ్య, పాఠశాల హెచ్ఎం యు. సత్యనారాయణ, ప్రముఖ కార్మిక నాయకులు దవులూరి సుబ్బారావు, వైఎస్ఆర్ సిపి నాయకులు ఆవాల లక్ష్మీనారాయణ, గోలి వెంకటప్పారావు చౌదరి, ఊబా జాన్  మోజస్, జుత్తుక సుబ్బలక్ష్మి, గవరసాన సూరిబాబు, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us