మార్చి మూడున దివిలి కిట్స్ లో మెగా జాబ్ మేళా

UPDATED 28th FEBRUARY 2018 WEDNESDAY 8:00 PM

పెద్దాపురం: తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం దివిలి కిట్స్ ఇంజనీరింగ్ కళాశాల క్యాంపస్ లో ఈ నెల మూడవ తేదీన కౌశల్ గోదావరి వికాస్ సంస్థ సహకారంతో మెగా జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు కళాశాల చైర్మన్ బేతినీడి శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ జాబ్ మేళాలో భారీస్థాయిలో 3220 ఉద్యోగాలకు, 36 ప్రముఖ కంపెనీలు ఎంపికలు నిర్వహిస్తామన్నారు. సాఫ్ట్ వేర్, హార్డ్ వేర్, బ్యాంకింగ్, ఫార్మా రంగాల్లో విద్యార్థులు ఉపాధి అవకాశాలు పొందవచ్చన్నారు. మణిపాల్ గ్లోబల్ ఐఐటి, టిసిఎస్, వేదిక్ సాఫ్ట్, హెట్రో డ్రగ్స్, అపోలో ఫార్మా, కేర్ హాస్పటల్స్, ఫ్లిప్ కార్ట్, ఎస్.బి.ఐ, ఐసిఐసిఐ, నిప్పన్, సోలార్ ప్రాజెక్ట్స్, జెన్ ప్యాక్, ఫోక్సాన్, ఐటిసి తదితర కంపెనీల ప్రతినిధులు హాజరవుతారన్నారు. ట్రైనీ మేనేజర్లు, సాఫ్ట్ వేర్ డవలపర్స్, బిజినెస్ ట్రైనీస్, వెబ్ డవలపర్స్ వంటి ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారన్నారు. పదవ తరగతి నుంచి పిజి వరకు విద్యార్హత కలిగిన విద్యార్థులు ఇంటర్వ్యూలకు అర్హులన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ మెగా జాబ్ మేళాలో పాల్గొని ఉపాధి పొందవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో వికాస పిడి వి.ఎన్. రావు, హెచ్.ఆర్ లచ్చారావు, కళాశాల ఏవో కె.ఆర్. సందీప్, ఈవో జెన్నిబాబు, ఎసివొ పెదకాపు, టిపివో రాఘవేంద్రరావు, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us