ఆదిత్యలో ఫార్మసీ విద్యార్థులకు జాతీయస్థాయి సదస్సు

UPDATED 19th MARCH 2018 MONDAY 9:00 PM

గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య క్యాంపస్ లో గల ఆదిత్య ఫార్మసీ కాలేజ్, ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఫార్మసీ కళాశాలలు సంయుక్తంగా ఫార్మాస్యూటికల్ పరిశ్రమలో నాణ్యత, నియంత్రణ పాత్ర (రోల్ ఆఫ్ క్వాలిటీ కంట్రోల్ ఇన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ) అనే అంశంపై ఒకరోజు జాతీయసదస్సు సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ముంబైలోని బార్క్, హోమీబాబా నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిపార్ట్ మెంట్ ఆఫ్ ఆటామిక్ ఎనర్జీ ప్రొఫెసర్ ఎ.వి.ఆర్. రెడ్డి, హైదరాబాద్ కు చెందిన ఫార్మా ట్రైన్ మేనేజర్ షేక్ మదీష్, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, హైదరాబాద్ కి చెందిన ప్రముఖ సైంటిస్ట్ డాక్టర్ జి. సుధాకర్ పాల్గొని బీఫార్మసీ, ఎం. ఫార్మసీ, ఫార్మా-డి విద్యార్థులకు నాణ్యత, నియంత్రణపై సూచనలు, సలహాలు తెలియచేశారు. ఔషధ తయారీలో సరికొత్త ఆవిష్కరణలు, పరిశోధనల్లో విద్యార్థులు ఆసక్తి చూపాలని, ప్రతీ పరిశ్రమలో నాణ్యతా ప్రమాణాల పాత్ర ఎంతో కీలకమని వివరించారు. పరిశోధనలో సమర్ధత, భద్రత, నాణ్యతతో పాటు వాటిపై ఫిర్యాదులు లేకుండా పరిశీలన చేసి పరిగణనలోకి తీసుకోవడం ఎంతో ముఖ్యం అన్నారు. అనంతరం ముఖ్య అతిథులను ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి, ప్రిన్సిపాల్స్ డాక్టర్ కె. రవిశంకర్, ప్రొఫెసర్ వై. సురేంద్రనాధ్ రెడ్డి, అధ్యాపకులు డాక్టర్ దివాకర్, డాక్టర్ డి. సతీష్ కుమార్ తదితరులు జ్ఞాపిక, దుశ్శాలువాలతో ఘనంగా సత్కరించారు.      

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us