గంగవరం (రెడ్ బీ న్యూస్) 15 డిసెంబర్ 2021: పౌష్టికాహారంతోనే తల్లీ బిడ్డలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని జడ్పీటీసీ సభ్యురాలు బేబీ రత్నం అన్నారు. మండల కేంద్రమైన గంగవరంలోని అంగన్వాడీ కేంద్రంలో సీడీపీవో నీలవేణి ఆధ్వర్యంలో అన్నప్రాసన కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరైనా ఆమె మాట్లాడుతూ ఏడో నెల నుండి బిడ్డకు ఎటువంటి ఆహారం పెట్టాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి తదితర వివరాలను వివరించారు. ప్రభుత్వం సరఫరా చేస్తున్న పాలు, బాలామృతం, గుడ్లు చిన్నారులకు తప్పనిసరిగా అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యురాలు గంగాదేవి, సర్పంచ్ అక్కమ్మ ఐసిడిఎస్ సూపర్వైజర్ సత్యవతి, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్‌పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







