కాకినాడ విజయం చంద్రబాబుకు అంకితం

--త్వరలో వైసీపీ ఖాళీ 
--ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప
UPDATED 1st SEPTEMBER 2017 FRIDAY 11:00 AM
అమరావతి : కాకినాడ నగర పాలక సంస్థ ఎన్నికలలో టీడీపీ సాధించిన విజయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుకు అంకితం ఇస్తున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. కె.ఎం.సీ ఎన్నికల్లో టీడీపీకి విజయాన్ని అందించిన ఓటర్లకు ఆయన పేరుపేరునా కృతఙ్ఞతలు తెలియచేశారు. అనంతరం విలేఖరులతో మాట్లాడారు. అభివృద్ధి, సంక్షేమానికి ఓటర్లు పట్టం కట్టారని, త్వరలోనే వైసీపీ తెరమరుగుకావడం తధ్యం అన్నారు. టీడీపీ విజయాన్ని జీర్ణించుకోలేని ప్రతిపక్షం చేస్తున్న విమర్శలు వారి దివాళా కోరుతనానికి నిదర్శనం అని, కాకినాడ స్మార్ట్ సీటీగా అభివృద్ధి చెందాలనే ఆలోచనతోనే ఓటర్లు టీడీపీకి విజయాన్ని అందించారని పేర్కొన్నారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us