ప్రయాణికులకు స్క్రీనింగ్ టెస్టులు తప్పనిసరి

* రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ అభిషిక్త్ కిషోర్

UPDATED 1st JUNE 2020 MONDAY 8:00 PM

రాజమహేంద్రవరం(రెడ్ బీ న్యూస్): కేంద్ర ప్రభుత్వం రైళ్లను కూడా నడుపుతున్న నేపథ్యంలో రద్దీ పెరిగే అవకాశం ఉన్నందున వచ్చేపోయే ప్రయాణికులు పట్ల అప్రమత్తంగా ఉండాలని రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మున్సిపల్ కార్పోరేషన్ కార్యాలయంలో మెడికల్,  రెవెన్యూ, పోలీస్, ఆర్.టి.సి, రైల్వే, ఆర్.పి.ఎఫ్ అధికారులతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రయాణికులకు ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, అన్ని ప్రాంతాల్లో స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించాలని, ఈ పరీక్షలను బట్టి హైరిస్క్ ఉన్న ప్రాంతాల వారిని వేరు చేసి వారం రోజులు క్వారంటైన్ లో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. రైళ్లు వచ్చే ఒక గంట ముందు ప్రయాణికుల ఛార్టును బట్టి అన్ని శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఆయా ప్రాంతాల్లో పోలీసు బందోబస్తు, భౌతిక దూరం పాటించే విధంగా తరచూ చేతులు శుభ్రం చేసుకునేలా చర్యలను విస్తృతం చేయాలన్నారు, ఎయిర్ పోర్టుకు సంబంధించి చర్యలపై తహసీల్దార్లను ఆదేశించారు. ఈ సమావేశంలో సబ్ కలెక్టర్ కార్యాలయం ఏఓ అనంత లక్ష్మీదేవి, డిప్యూటీ డిఎం&హెచ్ఓ డాక్టర్ కోమల, మున్సిపల్ కార్పోరేషన్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వినూత్న, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us