UPDATED 13th OCTOBER 2019 SUNDAY 9:00 PM
సామర్లకోట(రెడ్ బీ న్యూస్): స్థానిక పెన్షన్ లైన్ లో గల పేరంటాలమ్మ వారి ఆలయ వార్షిక జాతర మహోత్సవాలు ఆదివారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అమ్మవారికి అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో ముఖ్య అతిథులు పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, పెద్దాపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ దవులూరి దొరబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ దేవతలను కొలవడం మన సాంప్రదాయమని, 65 సంవత్సరాల చరిత్ర గల పేరంటాలమ్మ వారి ఆలయాన్ని యాదవ సహోదరులు ఐకమత్యంగా అభివృద్ధి చేసి జాతర మహోత్సవాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. అనంతరం అమ్మవారి ఊరేగింపు పెన్షన్ లైన్ నుంచి ఇస్మాయిల్ నగర్, వీరరాఘవపురం, సంగీతరావుపేట, గొల్లపేట, బళ్ళ మార్కెట్, మఠం సెంటర్ మీదుగా వివిధ వేష ధారణలతో అత్యంత వైభవంగా నిర్వహించారు. అలాగే పాత్రుళ్ళ వీధిలో ఉన్న శ్రీదేవి దుర్గ అమ్మవారిని అంగరంగ వైభవంగా వివిధ వేషధారణలతో పుర వీధుల్లో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక నాయకులు దవులూరి సుబ్బారావు, వైఎస్ఆర్ సిపి నాయకులు ఆవాల లక్ష్మీనారాయణ, సేపేని సురేష్, తెలుగుదేశం పార్టీ నాయకులు మన్యం చందర్రావు, అడబాల కుమారస్వామి, యార్లగడ్డ రవిచంద్ర ప్రసాద్, గోపాలకృష్ణ యాదవ సంఘం అధ్యక్షులు నమ్మి శ్రీనివాసు, గౌరవ అధ్యక్షులు ఎం. రాంబాబు, వైస్ ప్రెసిడెంట్ డి. సూరిబాబు, సెక్రెటరీ ప్రసాద్, బాబురావు, కోశాధికారి రాజాని తాతయ్యలు, సభ్యులు డి. రమణ, రాజాని శివ, బర్ల వెంకట్, శీలం సత్తిబాబు, నమ్మి వెంకన్న, భాగ్యరాజ్, గోవిందు, తదితరులు పాల్గొన్నారు.







