భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీ పూజలు

UPDATED 23rd AUGUST 2019 FRIDAY 9:00 PM

సామర్లకోట (రెడ్ బీ న్యూస్) : సామర్లకోట పట్టణ, మండల పరిధిలోని గ్రామాల్లో శ్రావణ మాసం నాల్గవ  శుక్రవారం సందర్భంగా పలు ఆలయాల్లో సామూహిక వరలక్ష్మీ పూజలు ఘనంగా జరిగాయి. ప్రసిద్ధ పంచారామ క్షేత్రమైన శ్రీ కుమారారామ భీమేశ్వరస్వామి ఆలయంలో దేవస్థానం కార్యనిర్వాహణాధికారి పులి నారాయణమూర్తి ఆధ్వర్యంలో, స్థానిక బడేలమ్మ చెరువు వద్ద గల నవదుర్గ ఆలయం, నూకాలమ్మ ఆలయాల్లో ఆలయ కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో ఈ సామూహిక వరలక్ష్మీ పూజలు, కుంకుమార్చనలు వైభవంగా నిర్వహించారు. భక్తులకు అవసరమైన పూజాద్రవ్యాలను ఆలయ అధికారులు అందించారు. అధిక సంఖ్యలో మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో ఈ పూజల్లో పాల్గొన్నారు.   

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us