ఆ జంట సంథింగ్ స్పెషల్

UPDATED 26th JUNE 2017 MONDAY 7:00 PM

సామర్లకోట: తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం పెదబ్రహ్మదేవం గ్రామానికి చెందిన తోటకూర వీర వెంకట సత్యనారాయణ, సత్య వరలక్ష్మి దంపతుల జంటను సంథింగ్ స్పెషల్ గా చెప్పవచ్చు. ఇక్కడ విశేషం ఏంటంటే ఆ దంపతుల ఇద్దరి పుట్టినరోజులు ఒకే రోజు కావడం, అలాగే వారి పెళ్లి రోజును కూడా వారు అదే రోజు జరుపుకోవడం ఇక్కడ సంథింగ్ స్పెషల్. సుమారు 13 సంవత్సరాల నుంచి వారి ఇద్దరి పుట్టినరోజులతో పాటు, పెళ్లి రోజును కూడా అదే రోజును జరుపుకుంటూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ పుట్టిన రోజులతో పాటు, తమ పెళ్లి రోజును కూడా ఒకే రోజు జరుపుకోవడం తమకెంతో ఆనందంగా ఉందని ఆ జంట చెబుతున్నారు. ఈ నెల 27 న  వీరిద్దరూ పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ సంథింగ్ స్పెషల్ జంటకు మనం కూడా విషెస్ చెబుదామా....

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us