రెడ్ బీ న్యూస్, 7 జనవరి 2022 : ద్రాక్షపండు సైజులో కోడిగుడ్లు.. ఎప్పుడైనా చూశారా? లేదంటే.. కేరళకు వెళ్లాల్సిందే. మలప్పురంలోని ఏఆర్ నగర్ ప్రాంతానికి చెందిన సమద్ ఇంట్లోని కోడిపెట్ట ద్రాక్షపండ్ల సైజులో గుడ్లు పెడుతోంది. అయిదేళ్ల వయసున్న ఈ కోడిపెట్ట పెడుతున్న గుడ్లలో తెల్లసొన మాత్రమే ఉండి, పచ్చసొన లేకపోవడం మరో విశేషం. కొన్నిరోజుల క్రితం వరకు మామూలు సైజులోనే గుడ్లను పెట్టేదని సమద్ చెప్పారు. ‘మా ఇంట్లో ఉన్న మిగతా కోళ్లకు పెట్టే ఆహారాన్నే ఈ కోడికీ పెడతాం. అయినా ఇలా వింత సైజులో ఇప్పటిదాకా 9 గుడ్లు పెట్టింది’ అని వివరించారు. ఈ చిన్నగుడ్ల ఫొటోలు, వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో.. వాటిని చూసేందుకు చాలామంది సమద్ ఇంటికి వస్తున్నారు.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్‌పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







