UPDATED 8th JULY 2018 SUNDAY 9:00 PM
పెద్దాపురం: సమాచార హక్కు చట్టం అమలులో రెవెన్యూ అధికారులు విఫలం అయ్యారు. స్థానిక మిరపకాయల వీధికి చెందిన గుణ్ణం లక్ష్మణరావు సమాచారం నిమిత్తం మేనెల 31వ తేదీన స్థానిక ఆర్డీవో కార్యాలయానికి ధరఖాస్తు చేశాడు. అయితే గడువు దాటినా ఇంతవరకూ తనకు సమాచారం ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. రెవెన్యూశాఖ అధికారుల నిర్లక్ష్యంపై తాను జిల్లా కలెక్టరుకు ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన తెలిపారు.







