UPDATED 14th SEPTEMBER 2018 FRIDAY 9:00 PM
సామర్లకోట: ప్రభుత్వ పథకాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని ఉన్నత విద్యావంతులుగా ఎదగాలని జెడ్పీటీసీ సభ్యురాలు గుమ్మళ్ళ విజయలక్ష్మి అన్నారు. హెచ్ఎం సిహెచ్ శిరీష అధ్యక్షతన స్థానిక బ్రౌన్ పేటలో గల జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో విద్యార్థినులకు ఏకరూప దుస్తుల పంపిణీ కార్యక్రమంలో శుక్రవారం ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ సభ్యురాలు విజయలక్ష్మి మాట్లాడుతూ మధ్యాహ్న భోజన పథకం, ఉచిత పుస్తకాలు, యూనిఫాం పంపిణీ వంటి తదితర అనేక పథకాలను నిరుపేద విద్యార్థుల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిందని, ఈ పథకాలను విద్యార్థులందరూ సద్వినియోగ పరుచుకుని ఉన్నత విద్యావంతులుగా ఎదగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో వై.వి. శివరామకృష్ణయ్య, ఉపాధ్యాయులు, విద్యార్థినులు, తదితరులు పాల్గొన్నారు.







