UPDATED 30th DECEMBER 2019 MONDAY 8:00 PM
పెద్దాపురం(రెడ్ బీ న్యూస్): పెద్దాపురం మండలం కట్టమూరు గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1997-1998 సంవత్సరానికి చెందిన పదవ తరగతి పూర్వ విద్యార్థులు సోమవారం పాఠశాలలో కలుసుకుని సందడి చేశారు. ఈ కార్యక్రమంలో ఒకరికొకరు పలకరించుకుంటూ తమ స్నేహితులతో ముచ్చటించుకున్నారు. పాఠశాలలో చదివిన రోజులు, జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ ఉల్లాసంగా గడిపారు. అలాగే తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను ఆప్యాయంగా పలకరించి వారిని ఘనంగా సన్మానించారు. దీంతో పాఠశాలలో పండగ వాతావరణం నెలకొంది. ఎక్కడెక్కడి నుంచో పూర్వ విద్యార్థులు తాము చదువుకున్న పాఠశాలకు తరలివచ్చి రోజంతా ఉల్లాసంగా గడిపారు.







