ఉత్తమ పౌరులను తీర్చిదిద్దేది గురువులే

UPDATED 5th SEPTEMBER 2018 WEDNESDAY 9:00 PM

సామర్లకోట: విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన గురుతర బాధ్యత ఉపాధ్యాయులపైనే ఉందని జెడ్పీటీసీ సభ్యురాలు గుమ్మళ్ళ విజయలక్ష్మి అన్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతి సందర్భంగా ఎంఇవో వై.వి. శివరామకృష్ణయ్య అధ్యక్షతన స్థానిక లయన్స్ క్లబ్ లో బుధవారం నిర్వహించిన గురుపూజోత్సవం వేడుకల్లో ముఖ్య అతిధిగా ఆమె పాల్గొన్నారు. ముందుగా రాధాకృష్ణన్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ విద్యార్థుల్లో జ్ఞానం నింపే జ్యోతి ఉపాధ్యాయుడని కొనియాడారు. ఉపాధ్యాయులు సంపూర్ణ అక్షరాస్యతకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా మహిళా అక్షరాస్యతను మెరుగుపర్చాలన్నారు. ప్రస్తుత సమాజానికి ఉపయోగకరంగా నిలిచే విలువతో కూడిన విద్యను పాఠశాలల్లోని విద్యార్థులకు బోధించాల్సిన అవసరం ఉందని, విద్యాబోధన మార్కులతో ముడిపడకుండా ప్రస్తుత సమాజానికి ఉపకరించే శాస్త్రీయ దృక్పథాన్ని అందించాలని, మనుషులపై అవగాహన కల్పించేలా చదువులు ఉండాలని అన్నారు. సమాజాన్ని సక్రమ మార్గంలో నిలిపేలా తల్లిదండ్రులు, గురువులు కీలకపాత్ర పోషిస్తున్నారన్న భావన అందరిలో ఉందన్నారు. ఎంఇవో శివరామకృష్ణయ్య మాట్లాడుతూ వేట్లపాలెం, మేడపాడు గ్రామాలకు సంబంధించి నలుగురు ఉపాధ్యాయులు క్లస్టర్ వైస్ బెస్ట్ టీచర్ అవార్డుకు ఎంపికయ్యారని అన్నారు. ఈ సందర్భంగా విశ్రాంత ఉపాధ్యాయులు పి. జగన్ మోహన్ రావు, బి. అశోక్, ఎస్. లిల్లీ గ్రేస్, కె.వి. మల్లేశ్వరరావు, సి.హెచ్. అమ్మాజీ, జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత చిట్టూరి వీర వరప్రసాద్ దంపతులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి ఆకునూరి సత్తిబాబు, ఎంపీడీవో సి.హెచ్. జగ్గారావు, యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఐ. వెంకటేశ్వరరావు, వివిధ ఉపాధ్యాయ సంఘ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us