UPDATED 30th JUNE 2020 TUESDAY 7:00 PM
పెద్దాపురం(రెడ్ బీ న్యూస్): ఓవైపు జిల్లాలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. దీంతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ప్రజలు మాస్క్ పెట్టుకోకపోతే వారికి జరిమానా విధిస్తాం అని సాక్షాత్తూ అధికారులే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయితే మండలంలోని వడ్లమూరు గ్రామంలో మంగళవారం జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ ఇలా మాస్క్ లేకుండానే లేఅవుట్లను పరిశీలిస్తూ కనిపించారు. ఆయన వెంట ఉన్న సహచర అధికారులతో పాటు ఆయన సిబ్బంది సైతం మాస్క్ ధరించారు. ఆయన మాత్రం ఇలా మాస్క్ లేకుండానే లేఅవుట్ పరిశీలన చేశారు. ఆయన అలా మాస్క్ లేకుండా ఉండడం చూసి అక్కడ ఉన్న వారంతా ముక్కున వేలేసుకున్నారు. అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన ఉన్నతాధికారులే ఇలా చేస్తే ఎలా అని పలువురు గుసగుసలాడుకున్నారు.







