స్టూడెంట్స్ అండ్ కౌన్సిలింగ్ అంశంపై శిక్షణా తరగతులు

UPDATD 7th JUNE 2019 FRIDAY 8:00 PM

రాజానగరం: గోదావరి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (గైట్) అటానమస్ కళాశాలలో స్టూడెంట్స్ అండ్ కౌన్సిలింగ్ అనే అంశంపై అధ్యాపకులకు శుక్రవారం శిక్షణా తరగతులు ప్రారంభమయ్యాయి. కళాశాల ప్రిన్సిపాల్ డాక్ట టివి ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో విశ్రాంత డిఎస్పీ, సైకాలజిస్ట్, గైట్ ఒఎస్డీ డాక్టర్ నామగిరి బాబ్జి కీలకోపన్యాసం చేశారు. దేశాభివృద్ధికి అధ్యాపకులే మూల స్థంబాలని, ప్రశాంతమైన ఆలోచనలతో సున్నితమైన స్వభావం కలిగి ఉంటూ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తును తీర్చిదిద్దాలని అన్నారు. ఏకాగ్రత ఎంతో కీలకమని, విచక్షణ జ్ఞానం మానవులకు దేవుడిచ్చిన గొప్ప వరమని అన్నారు. అధ్యాపకులు పాఠ్యాంశాలు బోధించే సమయంలో విద్యార్థులను పరిశీలించాలని,  అలాగే విద్యార్థుల లక్ష్యాలు ఉన్నతంగా ఉండేలా అధ్యాపకులు శ్రద్ధ వహించాలని అన్నారు. అలాగే వారి లక్ష్యాలను సాధించడంలో విద్యార్థులకు అధ్యాపకులు తప్పక తోడ్పాటు అందించాలని సూచించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టివి ప్రసాద్ మాట్లాడుతూ రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ శిక్షణా తరగతుల ద్వారా అధ్యాపకులు వృత్తిపరమైన ఒత్తిడిని అధిగమించేందుకు ఎంతగానో ఉపయోగపడతాయని, ఈ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ లీలావతి, డైరెక్టర్ పి.ఆర్.కె. రాజు, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు, తదితరులు పాల్గొన్నారు.                  

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us