UPDATED 4th NOVEMBER 2017 SATURDAY 6:00 PM
గండేపల్లి: తూర్పుగోదారి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య గ్లోబల్ బిజినెస్ స్కూల్లో " మేనేజ్మెంట్ విద్యపై అవగాహన" అనే అంశంపై శనివారం వర్క్ షాప్ నిర్వహించినట్లు ఆదిత్య డైరెక్టర్ డాక్టర్ ఎన్.సుగుణారెడ్డి తెలిపారు. ఈ వర్క్ షాప్ కు ముఖ్య అతిధిగా బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెలికాం మేనేజ్మెంట్ (పూణే) డైరెక్టర్ డాక్టర్ వి. కృష్ణకుమార్ హాజరై మాట్లాడారు. ఆధునిక ప్రపంచంలో విద్య యొక్క ప్రాముఖ్యత, సమయపాలన ఆవశ్యకత గురించి విశ్లేషణాత్మకంగా వివరించారు. వృత్తిపరంగా, సామాజిక జీవితాలకు సమయపాలన ముడిపడి ఉందని, ఏదైనా పనిని సకాలంలో పూర్తిచేసినప్పుడే దానికి సార్ధకత ఉంటుందన్నారు. ఆదిత్య డైరెక్టర్ డాక్టర్ సుగుణారెడ్డి మాట్లాడుతూ తమ విద్యార్థులకు చదువుతో పాటు, నిష్ణాతులచే ఇటువంటి సదస్సులు నిర్వహించి వారి సర్వతోముఖాభివృద్ధికి నిరంతరం పాటుపడుతున్నామన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్. విశాలాక్షి మాట్లాడుతూ విద్యార్థులు తాము ఎంచుకున్న లక్ష్యాలను సాధించేవరకు నిరంతరం శ్రమించాలన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.







