వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అఖండ మెజార్టీతో గెలిపించాలి

UPDATED 4th APRIL 2019 THURSDAY 9:00 PM

సామర్లకోట: ఈనెల 11న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ  పెద్దాపురం నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థినిగా పోటీ చేస్తున్న తోట వాణి, కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ ఎంపీ అభ్యర్థిని వంగా గీతకు తమ అమూల్యమైన ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని తోట వాణి కుమారుడు తోట రాంజీ ఓటర్లను కోరారు. సార్వత్రిక ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా గురువారం సామర్లకోట పట్టణంలో పలు వార్డుల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి భారీ పాదయాత్ర చేసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా తోట రాంజీ మాట్లాడుతూ జనం కోసం వారిలో ఒకడిలా మెలగాలి, కష్టసుఖాల్లో పాలు పంచుకోవాలి, ఎన్ని కష్టాలు ఎదురైనా వారి కోసమే నిలబడాలి, ప్రాణాలు పణంగా పెట్టయినా ప్రజా శ్రేయస్సునే కాంక్షించాలి... ఇలాంటి లక్షణాలన్నీ ఉన్న నాయకులు అరుదుగానే ఉంటారని, అలాంటి అరుదైన నాయకుల్లో జగన్‌మోహన్‌రెడ్డి ఒకరని అన్నారు. ప్రజా సమస్యలే అజెండాగా ఆయన అలుపెరుగని పోరాటం కొనసాగించారని, ఎండనక, వాననక, అలుపెరుగక, జనమే కుటుంబంగా ప్రజాసమస్యలు తెలుసుకోవడమే లక్ష్యంగా జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారని, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధిస్తుందని ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్ సిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైయస్ఆర్ సీపీ నాయకులు కాపుగంటి  కామేశ్వరావు, గోలి వెంకట అప్పారావు చౌదరి, ఊబా జాన్ మోజెస్, మట్టపల్లి రమేష్ బాబు, ఆవాల లక్ష్మీనారాయణ, సేపేని సురేష్, ఎలిజిబెత్ రాణి ఉబేదుల్లా, శెట్టిబత్తుల దుర్గ, కానుబోయిన విజయకృష్ణ, వర్రే రవి, అధిక సంఖ్యలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us