గంగవరం (రెడ్ బీ న్యూస్) 4 జనవరి 2022: గంగవరం మండల పరిషత్ రెండవ వైస్ ఎంపీపీగా గంగాదేవి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మంగళవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ప్రత్యేక ఎన్నికల అధికారి సూర్యనారాయణ ఎంపిడివో జాన్ మిల్టన్ ఆధ్వర్యంలో రెండవ వైస్ ఎంపీపీ ఎన్నిక జరిగింది. గంగవరం ఎంపీటీసీ గంగాదేవి వైసీపీ అభ్యర్థిగా నిలబెట్టడంతో వేరే అభ్యర్థులు ఎవరు నామినేషన్ వేయకపోవడంతో ఆమె ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి సూర్యనారాయణ ప్రకటించారు. అనంతరం ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కృష్ణారెడ్డి జెడ్పిటీసీ బేబీరత్నం, ఎంపీటీసీలు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్‌పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







