UPDATED 4th AUGUST 2018 SATURDAY 9:00 PM
సామర్లకోట: సామర్లకోట మండలం మాధవపట్నం గ్రామంలో ప్రభుత్వ, ప్రయివేట్ పాఠశాల విద్యార్థులు శనివారం స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాలీ నిర్వహించారు. మాధవపట్నం ప్రత్యేకాధికారి, మండల విద్యాశాఖాధికారి వై.వి. శివరామ కృష్ణయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీలో పాఠశాల ఉపాధ్యాయులు, అంగన్వాడీ సిబ్బంది, పంచాయతీ సిబ్బంది పరిసరాల పరిశుభ్రత మనందరి భాద్యత అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ పిల్లి కృష్ణప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. అనంతరం గ్రామంలో నిర్మించతలపెట్టిన వర్మికంపోస్టు షెడ్ నిర్మాణానికి మాజీ సర్పంచ్ పిల్లి కృష్ణప్రసాద్ శంకుస్థాపన చేశారు.







