ఆదిత్య అసిస్టెంట్ ప్రొఫెసర్ కు డాక్టరేట్

UPDATED 6th JANUARY 2020 MONDAY 6:00 PM

గండేపల్లి(రెడ్ బీ న్యూస్): గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ & టెక్నాలజీ కళాశాల మెకానికల్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రమోద్ కుమార్ ఎన్ఐటి (పాట్నా) నుంచి డాక్టరేట్ పొందినట్లు ఆదిత్య విద్యా సంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి తెలిపారు. ఎన్ఐటి (పాట్నా) మెకానికల్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఏ.ఎన్. సిన్హా గైడెన్స్ తో ప్రమోద్ కుమార్ సమర్పించిన Pulsed ND; YAG, Laser Beam welding to Thin sheets అనే థీసిస్ కు ఈ డాక్టరేట్ పొందారని సతీష్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ నల్లమిల్లి శేషారెడ్డి, క్యాంపస్ డైరెక్టర్ డాక్టర్ ఎం. శ్రీనివాసరెడ్డి, ప్రిన్సిపాల్స్ డాక్టర్ టి.కె. రామకృష్ణారావు, డాక్టర్  ఆదిరెడ్డి రమేష్, డీన్.డాక్టర్ ఎ. రామకృష్ణ, మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి టి.ఎస్. సాగర్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పి. వేణుగోపాల్, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, తదితరులు ఆయనను అభినందించారు. 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us