UPDATED 7th DECEMBER 2018 FRIDAY 10:00 PM
సామర్లకోట: ప్రసిద్ధ పంచారామ క్షేత్రం శ్రీ చాళుక్య కుమారరామ భీమేశ్వరస్వామి ఆలయంలో కార్తీకమాసం సందర్భంగా శుక్రవారం రాత్రి నిర్వహించిన అఖండ కోటి దీపాలంకరణ పూజల్లో జిల్లా కలెక్టర్ కార్తికేయమిశ్రా దంపతులు పాల్గొన్నారు. ముందుగా ధ్వజస్థంభం వద్ద దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి అధిక సంఖ్యలో భక్తులు హాజరై స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. అధిక సంఖ్యలో భక్తులు తరలి రావడంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఇవో పులి నారాయణమూర్తి, దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ కంటే జగదీష్ మోహన్, సభ్యులు పడాల వీరబాబు, దూది రాజు, మహాంకాళి వెంకటగణేష్, సామర్లకోట ఎస్ఐ ఎల్. శ్రీనివాసనాయక్, తదితరులు పాల్గొన్నారు.







