UPDATED 26th MARCH 2018 MONDAY 9:00 PM
సామర్లకోట: స్థానిక 29వ వార్డు లారీస్టాండ్ సమీపంలో యూత్ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని పెద్దాపురం సిఐ ప్రసన్న వీరయ్య గౌడ్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవికాలంలో ప్రజల దాహార్తిని తీర్చడానికి చలివేంద్రాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ పాగా శిరీష, పాగా సురేష్ కుమార్, అధిక సంఖ్యలో యువకులు, తదితరులు పాల్గొన్నారు.







