UPDATED 21st SEPTEMBER 2019 SATURDAY 9:00 PM
గండేపల్లి(రెడ్ బీ న్యూస్): గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో ఈసీఈ విభాగం, ఐఐటి (ముంబయి) సంయుక్త ఆధ్వర్యంలో "ఎలక్ట్రానిక్ సిమ్" అనే అంశంపై ఒక రోజు వర్క్ షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఇలాంటి అవగాహనా సదస్సులు అధ్యాపకులు, విద్యార్థుల భవిష్యత్తుకు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. ఓపెన్ సోర్స్ టూల్స్ అనేవి ఐఐటి(ముంబయి) నుంచి ఎలాంటి ఖర్చు లేకుండా ఉచితంగా లభిస్తున్నాయని, వీటిని అధ్యాపకులు ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్స్ డాక్టర్ వి. శ్రీనివాసరావు, డాక్టర్ ఎస్. రమాశ్రీ, ఈసీఈ విభాగాధిపతులు జి. శ్రీదేవి, వి. సత్యనారాయణ, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.







