UPDATED 21st JANUARY 2019 MONDAY 6:15 PM
పెద్దాపురం: స్థానిక ఆర్డీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి రెండు అర్జీలు వచ్చినట్లు ఆర్డీవో ఎన్.ఎస్.వి.బి. వసంతరాయుడు తెలిపారు. వీటిలో పెద్దాపురం మండలం జె. తిమ్మాపురం గ్రామానికి సంబంధించి ఇంటి పట్టా ఇప్పించమని ఒకటి, కట్టమూరు గ్రామానికి సంబంధించి సొంత స్థలంలో విద్యుత్ స్తంభాన్ని నిర్మించినందున నష్టపరిహారం ఇప్పించమని ఒకటి అర్జీలు వచ్చినట్లు ఆర్డీవో తెలిపారు.







